Sunday, April 28, 2024

చేవెళ్ల ఆరోగ్య రథం: ఇంటివద్దే ఉచితంగా వైద్య పరీక్షలు

spot_img

వికారాబాద్ జిల్లా: నవాబ్ పేట్ మండలం ఏక్ మామిడి గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్య రథంలో రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని.. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే రిపోర్ట్ వచ్చిన వెంటనే తమ సిబ్బంది మీ వద్దకే వచ్చి మిమ్మల్ని కలిసి తగిన సలహాలు ఇచ్చి తమకు కావలసిన పూర్తి చికిత్సను ఉచితంగా అందచేస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.

ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే చిన్నపాటి సమస్య కదా అని నిర్లక్ష్యం చేయవద్దని దాని ప్రభావం కొద్ది కాలం తర్వాత తీవ్రస్థాయిలో ఉంటుందని అన్నారు. ఒక ఇంటి యజమాని అనారోగ్యంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఎంత నష్టపోతుందో మీ గ్రామంలో చూడండి అందుకే ప్రతి వ్యక్తి ఆరోగ్య రధం ద్వారా పరీక్షలు చేసుకొని చికిత్స తీసుకొని పూర్తి ఆరోగ్యంగా జీవించాలని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.

పార్లమెంటులో బండి సంజయ్ మాట్లాడిన విధానంపై ఎంపి రంజిత్ రెడ్డి చురకలు అంటించారు. 24 గంటల కరెంటు తెలంగాణలో ఇవ్వడం లేదని బండి సంజయ్ అంటున్నారని 24 గంటలలో ఎప్పుడైనా కరెంటు తీగలను పట్టుకుని చూడాలని అప్పుడు కరెంటు 24 గంటలు వస్తుందో లేదో తెలుస్తుందని ఎంపీ అన్నారు. చేవెళ్లే ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ ఆరోగ్య రతంలో పరీక్షలు చేయించుకొని ఆరోగ్యమైన జీవితాన్ని కొనసాగించాలని సూచించారు.

Latest News

More Articles