Thursday, May 2, 2024

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్‌కు జైలుశిక్ష

spot_img

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌కు జైలు శిక్ష పడింది. ఆ దేశ లేబర్‌ చట్టాలను ఉల్లంఘించిన కేసులో యూనస్‌తో పాటు ఆయనకు చెందిన గ్రామీణ్‌ టెలికాం సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులు దోషులుగా తేలడంతో వారికి ఆరునెలల సాధారణ జైలు విధించినట్లు ప్రాసిక్యూటర్‌ వెల్లడించారు.

మైక్రోఫైనాన్స్ బ్యాంక్‌ ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారు అని యూనస్‌ కు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. పెట్టుబడిదారీ విధానం, సామాజిక బాధ్యత విధానాల కలయికలో పేదల అభ్యున్నతి, మహిళల సాధికారత కోసం గ్రామీణ బ్యాంకును యూనస్ ఏర్పాటు చేశారు.

Latest News

More Articles