Sunday, April 28, 2024

మూడు ముళ్లతో ఒక్కటి కానున్న పరిణీతి రాఘవ చద్దా..వైరల్ వీడియో ..!!

spot_img

ప్రముఖ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా నేడు మూడుముళ్ల బంధంతో ఒక్కటికాబోతున్నారు. వారిద్దరూ ఉదయపూర్‌లోని ‘లీలా ప్యాలెస్’లో వివాహం చేసుకోనున్నారు. ఈ రాయల్ వెడ్డింగ్‌కు హాజరయ్యేందుకు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించడానికి ఉదయపూర్ చేరుకున్నారు. నిన్నటి నుంచి వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు కూడా పరిణీతి, రాఘవల పెళ్లి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిణీతి, రాఘవల వివాహానికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి హాజరయ్యేందుకు ఉదయపూర్ చేరుకున్నారు. ఉదయపూర్ విమానాశ్రయానికి చేరుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాఘవ్ చద్దా తల్లిదండ్రులు వారిని ఆప్యాయంగా స్వాగతించారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హోటల్‌లోకి ప్రవేశించిన వెంటనే, రాఘవ్ చద్దా తండ్రి మొదట సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పూలమాల వేసి, ఆపై అతన్ని కౌగిలించుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. దీని తరువాత,పరిణీతి, రాఘవల వివాహ వేదిక నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

More Articles