Sunday, April 28, 2024

మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని.. హైకోర్టు ఏమందంటే.?

spot_img

ఏపీ-తెలంగాణకు 10ఏండ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. త్వరలోనే ఈ గడువు ముగియనుంది. ఈ సమయంలో మరో 10ఏండ్లపాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. జూన్ 2తో 10ఏండ్ల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఏపీకి హైదరాబాద్ తో ఎలాంటి సంబంధం ఉండదు. అయితే రాష్ట్ర విభజన సరిగ్గా లేదని…ఈ కారణంగానే ఏపీకి రాజధాని లేకుండా పోయిందని..షెడ్యూల్డ్ ఆస్తుల పంపకాలు, కార్పొరేషన్ల విభజన, అప్పులపై లెక్కలు తేల్చలేదని..అందుకే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని ఏపీ కి చెందిన ప్రజా సంక్షమ సేవాకార్యదర్శి అనిల్ కుమార్ పిల్ వేశారు.

రెండు రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియ సరిగ్గా జరిగేలా చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ కారణంగానే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయంటున్నారు. సమస్యల్ని పరిష్కరించాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదని సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. పరిష్కారం కాకపోతే ఏపీకి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.అయితే ఈ పిల్ హైకోర్టు అనుమతి ఇస్తుందా లేదా దీనిపై కేంద్రాన్ని ఆదేశిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే రాజకీయ ప్రతిపాదనలను తెలంగాణ నేతలు ఖండిస్తున్నారు. దీంతో హైకోర్టు నిర్ణయం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: మహిళలకు కాస్త ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు..ఇవే.!

 

Latest News

More Articles