Friday, May 10, 2024

పది పాస్ అయితే ఉద్యోగం.. రేపే మెగా జాబ్ మేళా.!

spot_img

ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మార్చి 4వ తేదీని వరంగల్ నగరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఉపాధి అధికారి మాధవి ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగ సంస్థలు ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 4న జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని సూచించారు.

ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్ లో ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. డోకిల్ ఆన్ లైన్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో డెలివరీ బాయ్స్ గా వరంగల్ నగరంలో పనిచేసేందుకు ఈ ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. 150 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. పదవ తరగతి చదివిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 18 నుంచి 35ఏండ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి ఉండాలి. ఇందులో ఎంపిక అయితే 8 వేల నుంచి 10వేల వరకు జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులు కూడా అందజేస్తారు. ఈనెల 4న వరంగల్ లోని ఐటీఐ క్యాంపస్ ప్రాంగణంలో ఉదయం 11గంటలకు నిర్వహించే జాబ్ మేళా హాజరుకావాలన్నారు.

ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ కు ఊరట.!

Latest News

More Articles