Saturday, May 11, 2024

మహిళలకు కాస్త ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు..ఇవే.!

spot_img

నిన్నమొన్నటివరకు పెరిగిన బంగారం ధర..ఈ రోజు కాస్త ఊరట కలిగించింది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గింపు పై ఆశలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా బలపడింది. దీంతో మనదేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం ఉదయం నమోదు అయిన వివరాలను చూస్తే బంగారం, వెండి ధరలు 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,750 ఉండగా కిలో వెండి ధర రూ. 77వేలకు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో ఇవాళ ఉదయం నమోదు అయిన ధరలను చూస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ. 58,750 ఉండగా.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 వద్ద కొనసాగుతోంది.

-ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,900.
24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 64,240.

-ముంబయి, కోల్ కతా, బెంగళూరులో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,750.
24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 64,090.

-చెన్నైలో 10గ్రాముల బంగారంపై రూ.1000 పెరిగింది. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,400
24క్యారెట్ల గోల్డ్ రూ.63,720గా నమోదైంది.

వెండి ధర :
వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేవు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.77,000గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 77,000, ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.75,000, బెంగళూరులో కిలో వెండి రూ.72,150 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: అనంత్ ప్రీవెడ్డింగ్‎లో బేబీబంప్‎తో దీపికా -రణవీర్ డ్యాన్స్.!

Latest News

More Articles