Monday, May 6, 2024

అనంత్ ప్రీవెడ్డింగ్‎లో బేబీబంప్‎తో దీపికా -రణవీర్ డ్యాన్స్.!

spot_img

బాలీవుడ్ పవర్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్ పోస్ట్ ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. దీపికా-రణ్‌వీర్‌ల మొదటి బిడ్డ సెప్టెంబర్‌లో పుట్టబోతోంది. ప్రస్తుతం, జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లో దీపిక- రణవీర్ సందడిచేస్తున్నారు. ఇద్దరి లుక్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ లో రెండో రోజు చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో, బాలీవుడ్‌లోని క్యూట్ కపుల్స్‌లో ఒకరైన దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్ డ్యాన్స్ వైరల్ అవుతోంది.

ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత, దీపికా పదుకొనే-రణ్‌వీర్ సింగ్‌ల మొదటి డ్యాన్స్ వీడియో ఇది. ప్రెగ్నెన్సీ అయిన దీపికా పదుకొణె చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దీపికా-రణ్‌వీర్ ‘నాగడ సాంగ్ ధోల్’, ‘గల్లన్ గుడియాన్’లకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

ఈ జంట చేసిన డ్యాన్స్‌ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్‌లో రణ్‌వీర్-దీపిక ‘దిల్ ధడక్నే దో’లోని ఫేమస్ సాంగ్ ‘గల్లన్ గుడియాన్’పై డ్యాన్స్ చేశారు. వీడియోలో, దీపిక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న లెహంగాను ధరించగా..రణ్‌వీర్ బ్లూ కలర్ షేర్వానీలో తళుక్కున మెరిసారు.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

ఇది కూడా చదవండి: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ లో సల్మాన్, షారుఖ్ డ్యాన్స్ అదుర్స్. !

Latest News

More Articles