Tuesday, April 30, 2024

ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. కామెంట్‌ సెక్షన్‌లో పోల్స్‌

spot_img

న్యూఢిల్లీ: ప్రముఖ ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ మరో ఫీచర్‌ని తీసుకురానుంది. కామెంట్‌ సెక్షన్‌లో పోల్స్‌ పెట్టేలా కొత్త ఫీచర్‌ని యూజర్లకు అందించనుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి తెలిపారు.  ఇన్‌స్టాగ్రామ్‌లోని కామెంట్‌ సెక్షన్‌ను మరింత ఆసక్తిగా మార్చటంపై మెటా దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.

Also Read.. దసరా పండుగ ఎఫెక్ట్: హైవేలపై ట్రాఫిక్ జామ్

ఇప్పటివరకు కేవలం ఇన్‌స్టా స్టోరీల్లో మాత్రమే పోల్స్‌ నిర్వహించేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇకపై సాధారణ పోస్టులు, రీల్స్‌.. ఈ రెండింటి కామెంట్‌ సెక్షన్లలో పోల్స్‌ నిర్వహించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలోనే ఉంది. త్వరలోనే ఇన్‌స్టా యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Latest News

More Articles