Sunday, April 28, 2024

రామ్‌ చరణ్‌కు మ‌రో అరుదైన అవార్డ్

spot_img

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌కు మ‌రో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించే పాప్ గోల్డెన్ అవార్డ్స్‎లో రామ్ చ‌ర‌ణ్‌కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు ద‌క్కింది. ఈ విష‌యాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్ల‌డించింది. ఇక ఈ అవార్డు కోసం రామ్ చ‌ర‌ణ్‌తో పాటు అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నాలు నామినేషన్స్ దక్కించుకోగా చరణ్‌ని ఈ అవార్డు వరించింది.

Read also: కర్ణాటకలో ‘ఉచిత బస్సు’కు నిధుల కష్టాలు.. మరి తెలంగాణలో ఎన్నాళ్లు సాగేనో?

ఇటీవల ఇచ్చిన నేషనల్ అవార్డ్స్‌లో చరణ్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తుందని మెగా ఫ్యాన్స్ భావించారు కానీ చరణ్, ఎన్టీఆర్‌ని కాదని అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు… నేషనల్ అవార్డు మిస్ అయినా ఇంటర్నేషనల్ అవార్డు రావడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Latest News

More Articles