Friday, May 10, 2024

బౌద్ధ మత పద్ధతుల్లో గద్దర్ అంత్యక్రియలు

spot_img

ప్రజా కవి, గాయకుడు గద్దర్ అంత్యక్రియలు బౌద్ధ మత పద్ధతుల్లో జరగనున్నాయి.ఈ మేరకు ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపట్లో అల్వాల్ మహాబోధి స్కూలులో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే గద్దర్ భౌతికకాయాన్ని హైదరాబాద్ ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్‌కు అంతిమయాత్రగా తరలించారు. గద్దర్ ఆదివారం మరణించడంతో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనాదర్ధం సోమవారం మధ్యాహ్నం వరకు ఎల్బీస్టేడియంలో ఉంచారు.

రాజకీయాలకు అతీతంగా వేలాది మంది ప్రజలు గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించారు. ఇక అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు. సీఎంతో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.

Latest News

More Articles