Sunday, April 28, 2024

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి..ఎమోషనల్ వీడియో షేర్ చేసిన సోదరి..!

spot_img

సుశాంత్ సింగ్ రాజ్ పుత్..బాలీవుడ్ లో ఎగసిపడిన కెరటం. ఓ సామాన్యుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కెరీర్ ఎంత ఫాస్టుగా ఎదిగాడో..జీవితంలో అన్ని వదిలేసి చిన్న వయస్సులోనే ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. సుశాంత్ మరణవార్త తెలిసి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మరణ వార్త బాలీవుడ్ ను కదిలించింది. సుశాంత్ మరణించి మూడేళ్లు గడుస్తున్నా ఆయన జ్నాపకాలు ఇప్పటికీ అభిమానుల మదిలో పదిలంగా ఉన్నాయి. నేడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జయంతి. ఈ సందర్భంగా ఆయన సోదరి ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.

34ఏళ్ల వయస్సులో ప్రపంచానికి వీడ్కోలు పలికిన సుశాంత్ సింగ్..జూన్ 14, 2020న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన ఫ్లాట్ లో శవమై కనిపించాడు. ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి తన ఫ్యాన్స్ ను కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాడు. సుశాంత్ వార్తతో సిని ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది.

ఇది కూడా చదవండి: రష్మిక ఫేక్ వీడియో క్రియేట్ చేసింది ఆమె అభిమానే.. ఫ్యాన్ పేజీకి లక్షల్లో ఫాలోవర్లు

Latest News

More Articles