Thursday, May 2, 2024

పాండ్యాకు కెప్టెన్సీ.. మిస్ట‌ర్ 360 గుండె బ‌ద్ధ‌లైందా?

spot_img

ముంబై : ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతోంది. రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శ‌ర్మ‌ను కాద‌ని హార్దిక్ పాండ్యా కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం అంద‌ర్నీ షాక్‌కు గురిచేసింది. ఈ నిర్ణయం ఆ జట్టులోని సీనియర్లకు కూడా రుచించడం లేదు. తాజాగా స్టార్ బ్యాట‌ర్, మిస్ట‌ర్ 360 డిగ్రీ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్‌బ్రేక్ ఎమోజీని పోస్ట్ చేయడంపై చర్చ జరుగుతోంది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ‘పాండ్యాకు సార‌థ్యం అప్ప‌గించ‌డ‌మే కార‌ణ‌మా?’, ‘సూర్య ముంబై కెప్టెన్సీ ఆశించాడా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Latest News

More Articles