Sunday, April 28, 2024

రైతుబంధు వేస్తారా.. రేవంత్ ని దించేయాలా..!

spot_img

యాసంగి సీజన్‌ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. రైతుబంధు నిధులు పడక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే పలువురి ఖాతాల్లో రూ.1, రూ.62 చొప్పున జమ కావడంతో ఆయా రైతులు విస్తుపోయారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలానికి చెందిన పాండురంగారెడ్డికి ఐదు ఎకరాల భూమి ఉన్నది. ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున రూ.25 వేలు జమ కావాల్సి ఉండగా.. ఈసారి ఒక్క రూపాయి మాత్రమే జమైనట్టు ఆయన సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఆయన కంగుతిన్నారు.

ఇక ఇదే మండలంలోని టంకర గ్రామానికి చెందిన మరో రైతు ఆంజనేయులుకు రూ.62 జమైనట్టు మెసేజ్‌ వచ్చింది. ఆంజనేయులుకి గ్రామంలో రెండు గుంటల భూమి ఉండగా గతంలో రూ.250 పడేది. ఈ సారి రూ.62 మాత్రమే పడింది. తనకు వేరే సర్వే నంబర్‌లో ఎకరంన్నర భూమి ఉన్నప్పటికీ ఆ పైసలు ఇంకా పడలేదని ఆంజనేయులు పేర్కొన్నారు. రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ ఇంకా తమ ఖాతాల్లో జమ కాలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇక రైతుబంధు నిధులు పడకపోవడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున రైతులు నిరసనలు తెలుపుతున్నారు. మూకుమ్మడిగా మమ్మల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘ఆగం జేశిరన్నా’ అని రైతులంతా వాపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిన రైతుభరోసా రాలేదు.. రైతుబంధైనా పడలేదు. దీంతో రైతులకు ఏటూ దిక్కుతోచడం లేదు. యాసంగి కోసం సర్వం సిద్ధం చేసుకున్న రైతులు.. ఆశగా చూస్తున్న డబ్బులు ఇప్పటికీ పడటం లేదు.

గత ప్రభుత్వం రెడీగా ఉంచిన డబ్బులను కూడా ఇప్పటికీ వేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చేవన్నా వేయకుండా ఇదేం జాప్యమని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే కొనసాగితే రేపటి రోజున అసెంబ్లీ ముందు ధర్నాకైనా దిగితామని హెచ్చరిస్తున్నారు రైతులు. ఒకరైతు అయితే రేవంత్ రెడ్డి మాకు నచ్చడం లేదని చెప్పేస్తున్నారు. మరికొందరు రైతులైతే రేవంత్ రెడ్డి తమకు నచ్చటంలేదని.. ధర్నాలు చేసి రేవంత్ ని పదవి నుండి దించేస్తామని వాపోతున్నారు.

Latest News

More Articles