Wednesday, May 1, 2024

కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మరింత బాగుపడుతుంది

spot_img

మేడ్చల్ జిల్లా కీసర మండలం కేంద్రంలోని సహకార సంఘంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గంగా రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి తప్ప జొన్నలు మొక్కజొన్నలు సన్ ఫ్లవర్ శనిగలు ఇలాంటివి మరెనో కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో కేవలం వారం రోజులో రైతుల ఖాతాలో జమ చేయడం జరగుతుందని అన్నారు.రైతుల పై ప్రేమ వ్యవసాయంపై ఉన్న అభిమానము మక్కువతో రైతాంగం బాగుంటే దాదాపు వ్యవస్థ అంతా బాగుంటుంది రైతులు బాగుంటేనే ఈ వ్యవస్థ బాగుంటది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో కానివ్వండి దేశంలో గాని కానీవ్వండి దాదాపు 70% వరకు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు 30% మందిలో కూడా దాదాపు 20 శాతం మంది ఈ వ్యవసాయ రంగం బాగుంటేనే వాళ్ళు బాగుంటే మేము ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మార్కెట్లో రైతు దగ్గర డబ్బులు ఉంటే మార్కెట్లో అన్ని బిజినెస్ పుష్కలంగా డబ్బులు అనేది సర్కులేట్ అవుతుంది.

గత ప్రభుత్వాలు 500 కోట్ల మంజూరు చేస్తే ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రతి సంవత్సరం మాకు (900 ) తొమ్మిది వందల రూపాయలు కేటాయించడం జరగుతుందని అన్నారు.మా దగ్గర బఫర్ స్టాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కష్టపడేది మీ ప్రాంతంలో రైతాంగానికి ఎవరు కూడా ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మార్కెట్ దగ్గర అందుబాటులో నిల్వలువున్నాయని అన్నారు.ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండటం మన అందరూ ఈ రాష్ట్ర ప్రజలు చేస్తున్న అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే సబ్బండ వర్గాలకు మేలు చేసే సంక్షేమ పథకాలను ఈ వర్గం లో ప్రవేశపెట్టబడింది అందుకోసమే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందకరమైన జీవితం గడుపుతున్నాం.ఈ రోజు 24 గంటల విద్యుత్తు ఈ రాష్ట్రంలో ప్రతి రంగాన్ని కూడా 24 గంటల విద్యుత్తు నిరంతరాయంగా ఇస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఒకటే రైతులు స్థానిక సహకార సంఘం లో ఉన్న ఎరువులను,విత్తనాలు తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Latest News

More Articles