Sunday, April 28, 2024

2010-19 మధ్య టాప్‌-10 బౌల‌ర్లు వీళ్లే

spot_img

2010-19 కాలంలో కొంద‌రు బౌల‌ర్లు అత్య‌ద్భుత ప్ర‌ద‌ర్శ‌న కన‌బ‌రిచారు. గ‌త ద‌శాబ్దంలో అత్యంత విజ‌య‌వంత‌మైన బౌల‌ర్లుగా రికార్డుల్లో చోటుసంపాదించారు. ఈ జాబితాలో ఇండియా నుంచి ఒక్క ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ మాత్రమే నిలిచాడు.

1.జేమ్స్ అండ‌ర్సన్‌ (ఇంగ్లండ్): 2010-19 మ‌ధ్య‌కాలంలో అత్య‌ధిక వికెట్లు తీసి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. 106 టెస్టులు, 200 ఇన్నింగ్స్‌ల‌లో 429 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

  1. ర‌విచంద్ర‌న్ అశ్విన్(ఇండియా): 2010-19 ద‌శాబ్దంలో అద్భుతాలు చేశాడు. 70 టెస్టులు 131 ఇన్నింగ్స్‌ల‌లో 362 వికెట్లు తీసుకున్నాడు.

3.స్టువ‌ర్ట్ బ్రాడ్‌(ఇంగ్లండ్): ఈమ‌ధ్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 111 టెస్టులు, 207 ఇన్నింగ్స్‌ల‌లో 403 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

  1. నాథ‌న్ ల‌య‌న్(ఆస్ట్రేలియా): ఆగ‌స్టు 2011లో గాలేలో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌తో నాథ‌న్ ల‌య‌న్ టెస్టు అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించాడు. 95 టెస్టులు ఆడి 182 ఇన్నింగ్స్‌ల‌లో 380 వికెట్లు నేల కూల్చాడు.
  2. రంగ‌న హెరాత్(శ్రీలంక): 2010-19 కాలంలో శ్రీలంక త‌ర‌పున 72 టెస్టులు ఆడిన హెరాత్ 133 ఇన్నింగ్స్‌ల‌లో ఏకంగా 363 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
  3. డేల్ స్టెయిన్ (ద‌క్షిణాఫ్రికా): 59 టెస్టులు మాత్ర‌మే ఆడిన స్టెయిన్ 108 ఇన్నింగ్స్‌ల‌లో 267 వికెట్లు తీశాడు.
  4. ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్): డిసెంబరు 2011లో హోబర్ట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బౌల్ట్ నాలుగు వికెట్లు తీసి అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. 2014-15లో పాకిస్థాన్‌తో యూఏఈలో జరిగిన సిరీస్‌లోనూ బౌల్ట్ దుమ్మురేపాడు
  5. మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా): ఈ ఎడ‌మ చేతివాటం పేస‌ర్ 56 టెస్టులు, 107 ఇన్నింగ్స్‌లలో 240 వికెట్ల తీసుకున్నాడు.
  6. యాసిర్ షా(పాకిస్థాన్): 28 ఏళ్ల వయసులో దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన అత‌ను అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా గత దశాబ్దంలో 38 టెస్టుల్లో 71 ఇన్నింగ్స్‌లు ఆడి 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
  7. వెర్నాన్ ఫిలాండర్(దక్షిణాఫ్రికా): 2011లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2011-19 మధ్య 61 టెస్టులు ఆడిన ఫిలాండర్114 ఇన్నింగ్స్‌లలో 220 వికెట్లు నేలకూల్చాడు.

Latest News

More Articles