Sunday, April 28, 2024

క్రికెట్‌లో ‘కింగ్’ కెరీర్‌కు 15 ఏళ్లు

spot_img

క్రికెట్ లో కింగ్ గా పేరు తెచ్చుకున్న భార‌త జ‌ట్టు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్‌లో అడుగుపెట్టి సరిగ్గా 15 ఏండ్లు పూర్తయ్యాయి.  2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు.

ఫార్మాట్ ఏదైనా ప‌రుగుల వ‌ర‌ద పారించే కోహ్లీ ఇప్పటివరకు టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో కలిపి 500 మ్యాచ్‌లకు పైగా ఆడాడు. క్రికెట్ లో నిలకడగా రాణిస్తూ.. ఛేజింగ్ మాస్ట‌ర్‌గా మన్ననలు అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 111 టెస్టుల్లో కోహ్లీ 49.3 సగటుతో 8676 పరుగులు చేశాడు. 275 వన్డేలలో 57.32 సగటుతో 12,898 పరుగులు చేశాడు. 115 టీ20ల్లో 52.73 సగటు, 137.97 స్ట్రైక్ రేట్‌తో 4008 రన్స్ కొట్టాడు.

జై షా అభినంద‌న‌లు

విరాట్ కోహ్లీ క్రికెట్ లో అడుగుపెట్టి 15 ఏండ్లు పూర్తయిన సంద‌ర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జై షా అభినంద‌న‌లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ అద్భుతమైన విజయాలు కోట్ల‌ మందికి స్ఫూర్తినిస్తున్నాయని జై షా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Latest News

More Articles