Monday, May 6, 2024

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్..ఇక ఇంటర్నెతో అవసరం లేకుండానే..!

spot_img

ఈరోజుల్లో కమ్యూనికేషన్ చాలా సులువుగా మారింది. టెక్నాలజీ పెరగడం, వాట్సాప్ లాంటి కమ్యూనికేషన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో ఎంత దూరంలో ఉన్నా కూడా ఒకరినొకరు సులభంగా కనెక్టు అవుతున్నారు. పైగా వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను సైతం అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓ కొత్త ఫీచర్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ లేకుండా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటి మీడియా ఫైల్స్ షేర్ చేసుకునే విధంగా డెవలప్ మెంట్ చేస్తున్నారట.

ఇక ముందు నెట్ వర్క్ తో ఎలాంటి సంబంధం లేకుండానే వాట్సాప్ ద్వారా ఇతరులకు డాక్యుమెంట్లు షేర్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తున్నారట. వాబీటాఇన్ఫో ప్రకారం ఈ వాట్సాప్ కొత్త ఫీచర్..షేరిట్, బ్లూటూత్ లాంటి ఎనేబుల్డ్ యాప్స్ మాదిరిగానే పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మకంగా బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ వినియోగంలోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా చేసే ఫైల్స్ ట్రాన్స్ ఫర్ సేఫ్ గానే ఉంటుందని..అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ ఫెసిలిటీ డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరూ టాంపర్ చేయకుండా సెక్యూరిటీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ ఫీచర్ వాడాలంటే వాట్సాప్ సిస్టమ్, ఫోటోల గ్యాలరీ యాక్సెస్ వంటి పర్మిషన్లు ఇవ్వాలి. అయితే ఈ కొత్త వాట్సాప్ కొత్త ఫీచర్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారన్న విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై సంస్థ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే త్వరలోనే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

ఇది కూడా చదవండి: మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్‌

Latest News

More Articles