Monday, May 6, 2024

చేతిలో రూపాయి లేకున్నాసరే..కొత్త కారు కొనొచ్చు..ఎలాగో తెలుసా?

spot_img

మనదేశంలో చాలా మందికి ఒక ఇల్లు, సొంతంగా కారు ఉండాలన్న ఆశ ఉంటుంది. ఈ రెండింటిని సొంతం చేసుకోవాలంటే అధిక మొత్తం డబ్బు కావాలి. ఇంటి సంగతి పక్కపెడితే..కొందరికి ఒకేసారి డబ్బు పెట్టి కారు కొనేందుకు డబ్బులు ఉండవు. ఇలాంటి వారు ఫైనాన్స్ ఆప్షన్ ఎంచుకుంటారు. అంటే కస్టమర్లు కారు ధరలో కొంత డబ్బు ను డౌన్ పేమెంట్ గా చెల్లించి మిగిలిన మొత్తాన్నిలోన్ గా తీసుకుంటారు. దీనిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిర్ణీత మొత్తంలో వడ్డీ వసూలు చేస్తుంటాయి. అయితేకొన్ని సందర్భాల్లో డౌన్ పేమెంట్ చెల్లించకుండానే ఏకంగా వందశాతం ఫైనాన్స్ పొందుతాయి. అదేలాగో తెలుసుకోండి.

చాలా కమర్షియల్ బ్యాంకులు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ ను అందిస్తాయి. దీన్ని కార్ వితౌట్ డౌన్ పేమెంట్ అని కూడా పిలుస్తుంటారు. ఇలాంటి ఆప్షన్స్ బ్యాంకులు తమ ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు అందిస్తుంటాయి. వీటిని ప్రీ అప్రూవ్డ్ కార్ లోన్ ఆఫర్లుగా పేర్కొంటారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లు లేదా అధిక ఆదాయంఉన్నవారు ఇలాంటి బెనిఫిట్స్ పొందుతారు. సాధారణంగా అలాంటి లోన్స్ దాదాపు ఏడేండ్ల వరకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది.

కారును కొనుగోలు చేయడానికి ముందుస్తుగా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పైగా దీర్ఘకాలంలో లోన్ రీపేమెంట్ కూడా చేయవచ్చు. బ్యాంకులు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఫైల్ ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తారు.

కార్ లోన్స్ కు సాధారణ వడ్డీ రేట్లు 8.75శాతం నుంచి 9శాతం ఉంటాయి. జీర్ డౌన్ పేమెంట్ ఆప్షన్ ను వినియోగించుకున్నప్పుడు వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాదాపు తొమ్మిది నుంచి 10శాతం వరకు ఉంటాయి. అయినప్పటికీ ఆఫర్ ఎక్స్ షోరూమ్ ధర, కారు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ , ఇన్సూరెన్స్ సహా కొత్త కారుకొనుగోలుకు సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తుంది. కానీ కారుకు యాడ్ చేసిన ఏవైనా అడిషినల్ యాక్సెసరీలను ఆఫర్ కవర్ చేయదు. వినియోగదారులు వాటి కోసం జేబు నుంచి విడిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక కొత్త కారు కొనుగోలు చేసేందుకు జీర్ డౌన్ పేమెంట్ సదుపాయాన్ని పొందేందుకు బ్యాంకుకు కొన్నిడాక్యుమెంట్లు తప్పక అందించాలి. వీటితోపాటు సాధారణంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ , ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ , ఆరు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్లు ఉంటాయి. కొన్ని బ్యాంకులు లోన్ అప్లికేషన్స్ సజావుగా ప్రాసెస్ చేసేందుకు ఈ డాక్యుమెంట్లతోపాటు హామీదారుల గురించి సమాచారాన్ని కూడా అడుగుతాయి. ఇలాంటి అవసరమైన అన్ని వివరాలు సబ్ మీట్ చేస్తే బ్యాంకులు పరిశీలించి లోన్ మంజూరు చేస్తాయి.

ఇది కూడా చదవండి: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్..ఇక ఇంటర్నెతో అవసరం లేకుండానే..!

Latest News

More Articles