Monday, May 6, 2024

ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తుండ్రు…కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేసీఆర్.!

spot_img

కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బస్సు యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తుండ్రు అంటూ ఫైర్ అయ్యారు.

కేసీఆర్ మాటల్లో…
ఆ నాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. ఈ జిల్లాల్లో మంత్రులున్నారు. ఇరిగేషన్‌ మినిస్టర్‌ స్వయంగా ఇక్కడ ఉన్నడు. వీళ్లు దద్దమ్మల్లా పోయి నాగార్జునసాగర్‌ కట్టపై కేంద్రానికి, KRMBకి అప్పగించారు. మీరంతా కళ్లారా చూశారు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. 1956 నుంచి ఈ నాటి వరకు మన శత్రువు కాంగ్రెస్. 56వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో కలిపి 58 సంవత్సరాలు అనేక రకాలుగా గోసపెట్టిందే కాంగ్రెస్‌. మొన్న ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చింది. నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడుతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నడు. చెప్పులు మీకే లేవు రైతులకు కూడా ఉంటాయి. వాళ్ల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటాయన్న విషయం నేను చెప్పాను అంటూ అంటూ గుర్తు చేశారు కేసీఆర్‌.

బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో 18 పంటలకు ఏమాత్రం వెనుకాముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్‌ ఆయకట్టంతా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించాం. ఇవాళ ఈ రోజు ఏమైంది? సాగర్‌లో నీళ్లు ఉండే.. ఇవ్వగలిగే అవకాశం ఉండే. ఈ దద్దమ్మలకు దమ్ములేకనే .. ప్రాజెక్టును తీసుకుపోయి KRMBచేతులో పెట్టి పంటలన్నీ ఎండిపోయేలా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయవడం ఇదే తొలిసారి. రైతుబంధులో ధగా.. రైతుబీమా ఉంటదో ఊడుతదో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు రెప్పపాటు పోని కరెంటు కటుక బంద్‌చేసినట్లే మాయమైంది. ఎక్కడికి పోయింది కరెంటు ? ఏమైంది కరెంటుకు ? వీళ్లు కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పని చేయాల్సిన అవసరం లేకున్నా కేసీఆర్‌ 9ఏండ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నరంటూ మండి పడ్డార. కరెంటు ఎందుకు ఆగమవుతుంది’ అంటూ రేవంత్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: చేతిలో రూపాయి లేకున్నాసరే..కొత్త కారు కొనొచ్చు..ఎలాగో తెలుసా?

Latest News

More Articles