Sunday, April 28, 2024

తెలంగాణలో మళ్లీ  నీటి కష్టాలు:తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

spot_img

తెలంగాణ‌లో మళ్లీ తాగునీటి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఎండాకాలం రాక‌ముందే నీటి క‌ష్టాలు మొద‌ల‌వ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఏప్రిల్, మే నెల‌లో ప‌రిస్థితి ఏంట‌ని ఆందోళ‌న చెందుతున్నారు. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా నీళ్లు ఇవ్వాల‌ని మ‌హిళ‌లు డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం మారి..కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో నీటి క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పిట్లం మండలం బండపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో గత వారం రోజులుగా తాగు నీరు రావడం లేదని.. రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే మంచి నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని మ‌హిళ‌లు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: బెంగళూరు కేఫ్‌ పేలుడు లో న‌లుగురికి గాయాలు

Latest News

More Articles