Tuesday, May 7, 2024

కుప్ప‌కూలిన కోసి నదిపై నిర్మిస్తున్న వంతెన

spot_img

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన  కుప్పకూలింది.ఈ ప్రమాదంలో చనిపోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్‌ జిల్లాలోని మరీచా సమీపంలో భేజా, బకౌర్ మధ్య కోసీ నదిపై  భారీ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఉదయం బ్రిడ్జిలోని ఒక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని.. మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు.  గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్రిడ్జి 50, 51, 52 స్తంభాల గార్టర్‌లు నేలపై పడ్డాయని అన్నారు.

ఇది కూడా చదవండి:మరో ఘనత సాధించిన ఇస్రో…పుష్పక్ ప్రయోగం విజయవంతం.!

రూ.1700 కోట్లకుపైగా అంచనా వ్యయంతో కోసి నదిపై భగల్‌పూర్‌, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ 2014లో శంకుస్థాపన చేశారు. 2019లో పనులు పూర్తవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిర్మాణంలో గామన్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాన్స్ రైల్ లైటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జాయింట్ వెంచర్) ఉన్నాయి.

Latest News

More Articles