Monday, May 6, 2024

యూట్యూబ్ కు పోటీగా సరికొత్తగా ఎక్స్ టీవీ యాప్

spot_img

ట్విట్టర్ ను సొంతం చేసుకుని దాని పేరును ఎక్స్ గా మార్చేసిన ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్. ఇప్పుడు యూట్యూబ్ కు దీటుగా యాప్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని పేరు ఎక్స్ టీవీ యాప్. ఇది స్మార్ట్ టీవీల్లో చూసేందుకు వీలుగా ఉంటుంది. యూట్యూబ్ లాగా దీంట్లో కూడా యూజర్లు వీడియోలు అప్ లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ తరహాలోనే వీడియోలను సెర్చ్ చేసే సదుపాయం కూడా ఉంటుంది.

ఎక్స్ సీఈవో లిండా యాకరినో దీనికి సంబంధించిన అప్ డేట్ ను పంచుకున్నారు. “సరికొత్త పంథాలో, ఆకట్టుకునే కంటెంట్ ను త్వరలోనే మీ స్మార్ట్ టీవీల్లోకి తీసుకువస్తున్నాం. మా ఎక్స్ టీవీ యాప్ భారీ స్క్రీన్లపై హై క్వాలిటీ కంటెంట్ ను అందిస్తుంది. ఈ కంటెంట్ తో మీరు లీనమైపోతారు. చిన్న తెర నుంచి పెద్ద తెర వరకు ఎక్స్ ప్రతిదీ మార్చేస్తోంది… ప్రస్తుతం ఎక్స్ టీవీ యాప్ రూపుదిద్దుకున దశలో ఉంది” అంటూ లిండా యాకరినో ఓ వీడియోను ఎక్స్ లో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం

Latest News

More Articles