Saturday, May 4, 2024

మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్.. జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

spot_img

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ సహా కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దాంతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

కాగా.. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‎లకు వరద నీరు పోటేత్తింది. దాంతో రెండు రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నాయి. మరో రెండు రోజులు వర్షాలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. జలమండలి అధికారులు జంట జలాశయాలకు చెందిన చెరో రెండు గేట్లను నేడు ఉదయం 8 గంటలకు 2 అడుగుల మేర ఎత్తారు. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 1373 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ద్వారా మొత్తం 442 క్యూసెక్కుల నీటిని కిందనున్న మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. దాంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత వివిధ శాఖల అధికారులు రెస్క్యూ ఆపరేషన్‎కు సిద్ధంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు.

Latest News

More Articles