Tuesday, May 7, 2024

జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డ్…టాలీవుడ్ నుంచి మొదటి హీరో..!!

spot_img

RRRమూవీతో మన తెలుగు హీరోలు ప్రపంచ స్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ పేరును ఓ రేంజ్ లో ప్రపంచస్థాయిలో నిలబెట్టారు. గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు. ముఖ్యంగా జూనియన్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ హీరోగా మారారు. కొన్ని అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఈ మూవీలో కొమ్రుభీం పాత్రలో అలరించారు. ఆస్కార్ వేదికగా ఎక్కువ మంది తారక్ గురించి మాట్లాడుకున్నట్లు ఆ సర్వేలో మొదటిస్థానం సాధించాడు ఎన్టీఆర్. ఇక ఆస్కార్ కమిటీలో ప్లేస్ సంపాదించడంతోపాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో గౌరవాలను పొందాడు. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఫ్రంట్ పేజ్ లోనూ మెరిసాడు. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

తాజాగా బ్రిటన్ లో పాపులర్ అయిన ఏసీయన్ వీక్లీ న్యూస్ EasternEye 2023కిగాను టాప్ 50 ఏసియన్ స్టార్స్ ను ప్రకటించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్ కు స్ధానం దక్కింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ జాబితాలో 25వ స్థానంలో ఉన్నాడు. తెలుగు ఫిలం ఇండస్ట్రీ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక తెలుగు హీరోగా తారక్ అరుదైన ఘనతను సాధించడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ సంబురపడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ వార్త టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఘోరరోడ్డు ప్రమాదం…ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నలుగురు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం..!!

Latest News

More Articles