Monday, April 29, 2024

వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి సామంత రాజ్యం కాదు

spot_img

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని విమర్శించారు బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల మీద కాంగ్రెస్‌ కేసులు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కొప్పుల ఈశ్వర్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన ఇవాళ( గురువారం) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దపల్లిలో వివేక్‌ వెంకటస్వామి కుట్రలపై పైర్ అయ్యారు.

వివేక్‌ కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్ర చేస్తుందని బాల్క సుమన్‌ ఆరోపించారు. వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి పెద్దపల్లిని వాడుకుంటున్నారని ఆరోపించారు. పెద్దపల్లి వివేక్‌ వెంకటస్వామికి సామంత రాజ్యం కాదన్నారు. వేల కోట్ల ఆస్తులున్న వివేక్‌ దమ్ముంటే జనరల్‌ సీట్లలో పోటీ చేయాలని సవాలు విసిరారు. పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను వివేక్‌ కుటుంబం అణగదొక్కుతుందని అన్నారుజ

ప్రేద ప్రజల బాధలు వివేక్ కుటుంబానికి తెలియవన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్  కుమార్. ఆస్థులు కాపాడుకోవడం, పదవుల వ్యామోహం కోసం వివేక్ కుటుంబం ఆరాట పడుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోతామన్నారు. రిజర్వేషన్ల తీసివేతకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. బీజేపీ గెలిస్తే సర్వహక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఆర్ఎస్పీ.

దేశంలో ఈడీ దాడులు సరికాదన్నారు ఆర్ఎస్పీ. ప్రజలు బీజేపీ,కాంగ్రెస్ లను గద్దె దించాలన్నారు. తెలంగాణ  ప్రయోజనాల కోసం ,అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపియ్యాలని కోరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. జాబ్ క్యాలెండర్‌ అంతా భూటకమని..నొటిఫికేషన్ల ద్వారా అర్హులైన అభ్యర్థులకు వెంటనే ఉద్యొగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆర్ఎస్పీ.

ఇది కూడా చదవండి: ఎన్నికలను నడిపించేది ఈసీ కాదు ఈడీ

Latest News

More Articles