Monday, May 6, 2024

భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..!!

spot_img

నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ భగవంత్ కేసరి అనే ఫ్యామిలీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఏం చేస్తున్నారు..ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది. సోషల్ మీడియా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

ట్విట్టర్ రివ్యూ చూస్తుంటే మాత్రం బాలయ్యబాబుకు మరో హిట్ దక్కినట్లే కనిపిస్తోంది. ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఫస్టాఫ్ కాస్తా స్టోగా ఉన్నా…సెకాండాఫ్ మాత్రం అదిరిపోయిందని ఓవరాల్ సినిమా మొత్తం బాగుందంటున్నారు. బాలయ్య తెలంగాణ యాక్సెంట్ సూపర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీ బిజినెస్ విషయానికి వస్తే..
నైజాం: 14.50 కోట్లు
సీడెడ్: 13 కోట్లు
UA: 8 కోట్లు
తూర్పు : 5 కోట్లు
పశ్చిమ : 4 కోట్లు
గుంటూరు : 6 కోట్లు
కృష్ణ : 4కోట్లు
నెల్లూరు : 2.6 కోట్లు
ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తంగా : 57.10 కోట్లుగా ఉంది..
ఇక కర్నాటక తోపాటు  రెస్ట్ ఆఫ్ ఇండియా : 4.25 కోట్లు
ఓవర్సీస్ : 6 కోట్లు

Latest News

More Articles