Wednesday, May 1, 2024

పవన్‌ కల్యాణ్ పై బిగ్‌బాస్‌ ఫేమ్‌ తమన్నా సింహాద్రి పోటీ

spot_img

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అందరి దృష్టి ముఖ్యనేతల వైపు మళ్లింది. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో హీట్ తారస్థాయికి చేరుతోంది. ఇక జనసేన అధినేత బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి పవన్‌పై పోటీ చేయనుందన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇప్పటికే వైసీపీ పిఠాపురంలో మహిళా నేత వంగా గీతను బరిలో నిలిపింది. మరోవైపు, రామచంద్రయ్య యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరపున ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన 38 మంది అభ్యర్థుల జాబితాలో తమన్నా పేరు ఉండటం ఆసక్తికరంగా మారింది.

ప్రముఖులపై పోటీకి దిగడం తమన్నా సింహాద్రికి కొత్తేమీ కాదు. గతంలో ఆమె మంగళగిరిలో నారా లోకేశ్‌పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఒకప్పుడు జనసేన పార్టీలో ఉన్న తమన్నా సింహాద్రి అప్పట్లో మంగళగిరి టిక్కెట్ ఆశించారు. టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌‌గా పోటీ చేశారు. ఆ తర్వాత కూడా పవన్‌కు మద్దతు కొనసాగించారు. అయితే, టీడీపీ-జనసేన పొత్తు తర్వాత పవన్‌పై విమర్శలు ప్రారంభించిన తమన్నా చివరకు జనసేన అధినేతపైనే పోటీకి దిగారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో రాగల 5 రోజులపాట వర్షాలు..!

Latest News

More Articles