Sunday, April 28, 2024

ఎమ్మెల్సీ కవిత అరెస్టు..రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు..!

spot_img

ఎమ్మెల్సీ కవిత అరెస్టు రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యే అంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక చర్యకు నిరసనగా..శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్దెత్తున నిరసన కార్యక్రమలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శుక్రవారం సాయంత్రం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కవిత అరెస్టు రాజకీయంగా ప్రేరేపితమైనదే అంటూ ఫైర్ అయ్యారు.

ఏడాదిన్నర కింద కవితకు విట్ నెస్ కింద ఈడీ నోటీసులు ఇచ్చిందని..ఇవాళ వచ్చి నిందితురాలి కింద అరెస్టు చేస్తున్నామని చెబుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ఏడాదిన్నర కాలంగా ఏం చేశారని ఈడీని ప్రశ్నించారు. రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సమయంలో ఇవాళ కవితను అరెస్టు చేయడమంటే.. ఇదిపూర్తిగా రాజకీయ కుట్రే అంటూ విమర్శించారు. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కుట్రలను రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ, కాంగ్రెస్ కు శిక్ష తప్పదని హరీశ్ రావు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ పై పిటిషన్ వేసి లీగల్ గా ఫైట్ చేస్తాం

Latest News

More Articles