Sunday, May 5, 2024

ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ పై పిటిషన్ వేసి లీగల్ గా ఫైట్ చేస్తాం

spot_img

ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు.. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం రాజకీయ కుట్రే అని ఆరోపించారు.ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు…కావాలనే శుక్రవారం రోజు కవితను పథకం ప్రకారం అరెస్ట్ చేశారు.శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు అని కక్షతో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కవితను అరెస్టు చేశారు. అనేక సార్లు కవితను అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని,కేసీఆర్ ను డిమొరలైజ్ చేసే ప్రయత్నం బీజేపీ,కాంగ్రెస్ కలిసి చేశాయి. కుట్రలు బీఆర్ఎస్ పార్టీకి కొత్తకాదు. కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాం. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం.ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీకి సుప్రీంకోర్టు చెప్పింది. రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఈ రోజు కవితను అరెస్ట్ చేశారు. 19వ తేదీన సుప్రీం కోర్టు లో వాదనలు ఉంటే హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.

బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం బీజేపీ చేసిందన్నారు హరీశ్ రావు.కవిత అరెస్టుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. కాంగ్రెస్,బీజేపీల కుమ్మక్కు కవిత అరెస్టుతో అర్ధమైందన్నారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్,బీజేపీ పార్టీలకు ఓటమి తప్పదన్నారు. ముందు సెర్చ్ అని ఆ తర్వాత అరెస్టు అన్నారు…ముందే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. ఉద్యమాలు మాకు కొత్త కాదని తెలిపారు హరీశ్ రావు.

కవిత అరెస్టు రాజకీయ కుట్రకోణంలో చూస్తున్నామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత అన్నీ ఆధారాలు ఇచ్చారని తెలిపారు. ఢిల్లీ నుండి వచ్చినప్పుడే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని వచ్చారని..బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుందని ఆరోపించారు.మహిళలకు పి.ఎల్.ఎం.ఎ యాక్ట్ లో మహిళలకు మినహాయింపు ఉండాలని చెప్పింది. రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసుకోవడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇవ్వడం…వారు బీజేపీలో చేరగానే కేసులు లేకుండా చేశారు. బీజేపీకి కేసీఆర్ లొంగలేదు కాబట్టి కవితను అరెస్టు చేశారు. అనేక రాజకీయ పార్టీలని ఇలాగే లొంగదీసుకొని తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. కేసీఆర్ ఒక్కరే బీజేపీకి ఎదురుగా నిలబడ్డారు. కవిత నిర్దోషిగా బయటికి వస్తారని తెలిపారు జగదీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి:ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు..?

Latest News

More Articles