Thursday, May 2, 2024

జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం

spot_img

మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్ ను ఇవాళ(సోమవారం) జనసేనాని పవన్ కల్యాణ్ కు అందజేశారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్ లో జరుగుతుండగా… పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. షూటింగ్ స్పాట్ లోనే కొణిదెల బ్రదర్స్ ముగ్గురూ కాసేపు మాట్లాడుకున్నారు.

నిన్న అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు.

ఇది కూడా చదవండి: ఆశ‌యానికి, అహంకారానికి మ‌ధ్య జ‌ర‌గుతున్న యుద్ధం ఇది

Latest News

More Articles