Saturday, May 4, 2024

సూసైడ్ చేసుకున్న మహిళా న్యాయమూర్తి

spot_img

అందరికీ న్యాయం చేయాల్సిన న్యాయమూర్తి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో జరిగింది. మౌకు చెందిన జడ్జి జ్యోత్స్నా రాయ్‌ ఏడాది కిందట అయోధ్య నుంచి బదాయూ సివిల్ కోర్టుకు బదిలీ అయ్యారు. ప్రభుత్వ క్వాటర్స్‌లో నివసిస్తున్న ఆమె శనివారం ఉదయం తలుపులు తెరువలేదు. గమనించిన పని వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డోర్‌ పగులగొట్టి ఇంటి లోపలకు వెళ్లిన పోలీసులు న్యాయమూర్తి జ్యోత్స్నా రాయ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

Read Also: రేవంత్ పాలన రాక్షస రాజ్యం అయింది.. బాల్క సుమన్

కాగా, ఈ సమాచారం అందుకున్న జిల్లా జడ్జి, న్యాయశాఖ అధికారులు, ఎస్పీ, పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది జ్యోత్స్నా రాయ్‌ నివాసానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడకు చేరుకుని ఆధారాల కోసం నమూనాలు సేకరించింది. ఆమె సూసైడ్‌కు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles