Sunday, April 28, 2024

ఓటు ఒక బ్రహ్మాస్త్రం.. ఆలోచించి ఓటు వేయాలి

spot_img

కోదాడ: ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతదో, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగా పని చేస్తడో అనేది బాగా ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Also Read..  కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యిందని, ఇప్పటికీ ఎవరో చెప్పిన మాట విని ఓటు వేయకూడదని, సొంతంగా ఆలోచించి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఓటు అనేది మన చేతిలో ఉండే ఒకే ఒక బ్రహ్మాస్త్రం అని, ప్రజాస్వామ్యంలో దాన్ని మించిన శక్తి లేదని, కాబట్టి ప్రజలు ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.

Also Read.. నాటి కాంగ్రెస్‌ పాలకుల కుట్రలపై సీఎం కేసీఆర్‌ ఫైర్

ఒకప్పుడు కోదాడలో పంట పొలాలకు నీళ్ల కోసం ప్రతిసారి ధర్నా చేయాల్సి వచ్చేదన్నారు. లొల్లి పెట్టాల్సి వచ్చేదని గుర్తుచేశారు. 2003లో పంట పొలాలకు నీళ్లు ఆపేస్తే కొంతమంది తన దగ్గరికి వచ్చారని, అప్పుడు తానే 60, 70 మంది స్థానికులతో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ దగ్గిరికి వచ్చానని చెప్పారు. నీళ్లు ఇయ్యకపోతే బాగుండదని అల్టిమేటం ఇచ్చామని, దాంతో వెంటనే నీళ్లు వచ్చాయని సీఎం వెల్లడించారు.

Latest News

More Articles