Saturday, April 27, 2024

నాటి కాంగ్రెస్‌ పాలకుల కుట్రలపై సీఎం కేసీఆర్‌ ఫైర్

spot_img

కోదాడ: ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఊడగొట్టింది ఎవరు? తెలంగాణలో ప్రాజెక్టులను కట్టకుండా ఆపింది ఎవరు? ఇంత జరుగుతున్నా మారు మాట్లాడకుండా నోరు మూసుకుని పడి ఉన్న దద్దమ్మలు ఎవరు? అని నాటి కాంగ్రెస్‌ పాలకుల కుట్రలపై సీఎం కేసీఆర్‌ ఫైర్ అయ్యారు. 2001లో తాను గులాబీ జెండా ఎగరేసి ఈ అన్యాయాలపై నిలదీసిన దాక అడిగిన మొగోడే లేడని కోదాడ గడ్డపై గుర్తుచేశారు.

Also Read.. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేసింది శూన్యం

నల్గొండ జిల్లాలో చాలా మంది కాంగ్రెసోల్లు ఉండెనని, కానీ వాళ్లు ఎన్నడూ సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో కొట్లాడి నల్లగొండ జిల్లాకు నీళ్లు తేలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్ల కోసం పడ్డ గోస తీరిందని సీఎం వెల్లడించారు. కాళేశ్వరం జలాలను మూసీ దాటించి ఉదయం సముద్రంలో కలిపితే ఇక తెలంగాణకు నీళ్ల కరువు రాదన్నారు. తాము ప్రజల మేలు కోసం ఇలాంటి ఆలోచనలు చేస్తున్నామని, కానీ అవతలి పార్టీల వాళ్లకు కావాల్సింది ప్రజల ఓట్లే తప్ప మేలు కాదని విమర్శించారు.

Also Read.. ఓటర్ ఐడీ కార్డు లేదా? ఇవి ఉంటే చాలు ఓటేయ్యోచ్చు..!

నిజాం నుంచి విడిపోయి బూర్గుల నాయకత్వంలో కాంగ్రెస్‌ ఏలుబడిలోకి వచ్చిన బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్‌ కుటిల నీతితో ఆంధ్రాతో కలిపేశారని విమర్శించారు. సమైక్యాంధ్రలో కాంగ్రెస్‌ పాలకులు తెలంగాణలో సాగును పట్టించుకోకుండా ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోయారని తెలిపారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును ఏలేశ్వరం దగ్గర కాకుండా 20 కిలోమీటర్ల దిగువన కట్టడంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు నీళ్లు రాకుండా పోయాయని సీఎం అన్నారు. నాడు కాంగ్రెస్‌ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News

More Articles