Wednesday, May 1, 2024

ఓటర్ ఐడీ కార్డు లేదా? ఇవి ఉంటే చాలు ఓటేయ్యోచ్చు..!

spot_img

ఎన్నికలు వచ్చాయంటే ఇదో టెన్షన్. ఓటర్ ఐడీ ఎక్కడుందో అని వెతుకుతుంటాం. తీరా పోలింగ్ రోజు అది కనిపించకపోవడంతో…ఇంట్లో ఎంత వెతికినా దొరకదు. అప్పుడేం చేస్తాం? ఓటు వేయ్యకపోతే వెయ్యలేదన్న బాధ. మన ఓటు చాలా ముఖ్యమైంది. కాబట్టి ఈసీ మనకోసం చాలా వెసులుబాట్లు కల్పించింది. ఓటర్ ఐడీ కార్డు లేకున్నా సరే..ఇతర గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది.

ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు ఓటర్ ఐడీ కార్డు చూపించమని బూత్ సిబ్బంది అడుగుతారు. ఎందుకంటే ఓటర్ ఐడీ కార్డుపై మన పేరు, ఫొటో, చిరునామా, ఎపిక్ నెంబర్ ఇలా ఇతర వివరాలన్నీ కూడా ఉంటాయి. అప్పుడే నిజమైన వ్యక్తి ఓటు వేస్తున్నారని నమ్ముతారు. ఓటర్ ఐడీ లేకపోతే మనం నకిలీ ఓటరు కాదని నిరూపించుకోవల్సి ఉంటుంది. అందుకోసం ఇతర ఐడీ కార్డులను కూడా చూపించవచ్చు.

-ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఇండియన్ పాస్‌పోర్టు, ఫొటోతో పోస్టాఫీస్ ఇచ్చిన పాస్‌బుక్, ఫొటోతో బ్యాంక్ ఇచ్చిన పాస్‌బుక్, ఫొటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, RGI జారీ చేసిన స్మార్ట్ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు, ఎన్జీఆర్ఏ జాబ్ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు ఇలా వీటిని చూపించి ఓటు వేయవచ్చు.

ఇది కూడా చదవండి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

Latest News

More Articles