Sunday, April 28, 2024

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేసింది శూన్యం

spot_img

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చేసింది శూన్యం అని అన్నారు. వాళ్ళు సోషల్ మీడియానే నమ్ముకుందని, మనం అదే సోషల్ మీడియాని బ్రహ్మస్త్రంగా మార్చుకొని మనం అభివృద్ధి చేసిన పనులను సెల్ఫీ రూపంలో ప్రతి ఇంటికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.

Also Read.. రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మామడ ఎస్సై రాజు

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు ఇచ్చింది సీఎం కేసీఆర్ అని రీల్స్ చేసి పెట్టాలి. ఆనాడు వరంగల్, నల్గొండ, ఖమ్మం,కామారెడ్డి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో అందరికీ అర్థమయ్యేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.  2014కు ముందు కరెంట్ పరిస్థితి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలి. ఎవరైనా చనిపోతే కరెంట్ కోసం ఏఈ లకు ఫోన్ చెసిన రోజులు అవి. ఇప్పుడా పరిస్థితి లేదు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ రాష్ట్రమంతా ఇస్తున్నామని తెలిపారు.

ఆనాడు తెలంగాణ కోసం కేసీఆర్ శవ యాత్రనో లేక జైత్ర యాత్రనో అని పోరాటం చేశారు. ఆనాడు తెలంగాణలో సాగునీటి, తాగునీటి సమస్య ఎలా ఉండేనో అందరం కళ్ళారా చూసాం. 1956 లో ఆంధ్రాతో ఇదే కాంగ్రెస్ ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది. చంపినోడే సంతాపం తెలిపినట్టు ఓటు వేయండి అని ఇప్పుడు అడుగుతున్నారు. విద్యార్థి పోరాటలకు వ్యతిరేకంగా పని చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.

Also Read.. సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ క్యాంప్‌ క్లర్క్‌ విష్ణువర్ధన్‌ అనుమానాస్పద మృతి

రిక్రూట్మెంట్ గురించి కొంత మంది మాట్లాడుతున్నారు. 2004 నుంచి 2014 వరకు 24 వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చింది. మన ట్రాక్ రికార్డు తొమ్మదిన్నరేళ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు ఇచ్చాము.. మరో 90 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయి. పరీక్ష పత్రాలు లీక్ చేస్తారు.. మళ్ళీ వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటారని మండిపడ్డారు. టిఎస్పిఎస్ ని ఇంకా ప్రక్షాలను చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ బాధ్యతను నేనే తీసుకుంటాం. డిసెంబర్ తరవాత జాబ్ క్యాలెండరుని కూడా ప్రకటిస్తామని తెలిపారు.

మిగతా రాష్ట్రాలలో మన లాగా సంవత్సరానికి 22వేల ఉద్యోగాలు ఎవరైనా ఇచ్చారా? కొంత మంది అక్కడికి రా, ఉస్మానియాకి రండి అని మాట్లాడుతున్నారు నేను ఎక్కడైకైనా వస్తా. ఎవరు పడితే వాడు మాట్లాడితే వారి మాటలు నమ్మకండి.  నాలుగు ఓట్ల కోసం ఎన్నెన్నో మాట్లాడతారు. మిమ్మల్ని గుర్తించింది కేసీఆర్. ఎమ్మెల్యేలుగా, చైర్మన్ లుగా, జెడ్పిటిసి, ఎంతో మంది విద్యార్థులకు అవకాశం కల్పించింది సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

 Also Read.. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి

కాంగ్రెస్ వాళ్ళు బోగస్ మాటలు మాట్లాడుతారు. టిఎస్పిఎస్సి లో 30 లక్షలు మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. ఎన్రోల్మెంట్ చేసుకున్న వారంతా నిరుద్యోగులు కాదు. ఏదో ఒక్క జాబ్ చేసుకుంటూ వారు గవర్నమెంట్ కొలువు కోసం అప్లై చేసుకున్న వారే. 95 శాతం లోకల్ రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడి వారికే ఉద్యోగాలు ఇచ్చే విధముగా చర్యలు తీసుకున్నారు సీఎం కేసీఆర్ అని తెలిపారు. బీజేపీ వాడు చెప్పే మాటలు కోట్లలో, పనులేమో పకోడీలాగా ఉంటాయి. కేంద్రంలో 16లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  ప్రభుత్వ రంగ సంస్థలను వాళ్ళ అమ్ముతుంటే మనం బలపరుస్తున్నమని తెలిపారు.

ఈ 30 రోజులు అన్ని జిల్లాలలో విద్యార్థి యువజన సమ్మేళనాలు నిర్వహించి ప్రభుత్వ ప్రగతిని తెలియజెప్పాలి. మనం విద్యార్ధాలును పట్టించుకోవడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజల్లో విద్వేష బీజాలను బీజేపీ నాటుతుంది. నిన్న అమిత్ షా వచ్చి బీసి ముఖ్యమంత్రి అని చెపుతున్నాడు. బిసి అధ్యక్షుడినే తీసివేసారు వాళ్లు. బీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని చెప్తే పట్టించుకోరు. కులం, మతం ముఖ్యమా.. లేక నాయుకుడి గుణం, గుండె ధెర్యం ముఖ్యమా అని ప్రజలు ఆలోచన చేయాలని కేటీఆర్ సూచించారు.

Also Read.. కొచ్చి కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు

మనతో పోటీకి ఇద్దరు చిల్లర గాళ్ళు వస్తున్నారు. ఒక్కడు ఓట్ కీ నోట్ కేసులో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అమరవీరులను చేసిందే కాంగ్రెస్. సోనియా గాంధీని బలి దేవత అన్నది రేవంత్ రెడ్డి. ముద్దా పప్పు అని రాహుల్ గాంధీని అన్నది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి ని రేటంత రెడ్డి అని పిలుస్తున్నారు. నిన్న కర్ణాటక ఉపముఖ్యంత్రి డీకే శివ కుమార్ వచ్చి కర్ణాటకలో 5గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారని గుర్తుచేశారు.

Latest News

More Articles