Friday, May 10, 2024

కొచ్చి కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు

spot_img

కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. ఇవాళ(ఆదివారం) సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు జరగడంతో పోలీసులు వెంటనే అలర్టయ్యారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ నమ్మదు

Latest News

More Articles