Saturday, May 4, 2024

కాంగ్రెస్ జమానాలో నీళ్ల కష్టాలు అట్లుండే.. చుక్క స‌త్త‌య్య క‌థ చెప్పిన సీఎం కేసీఆర్

spot_img

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ : కాంగ్రెస్ జమానాలో నీళ్ల కష్టాలు ఎట్టా ఉండేనో సీఎం కేసీఆర్ ప్రజలకు తెలిపారు. చుక్క స‌త్త‌య్య అనే పేరుమోసిన ఒగ్గు క‌ళాకారుడు ఆనాడు 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేద‌ని గుర్తు చేశారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని క‌డియం శ్రీహ‌రికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

Also Read.. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది?

‘‘స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మాణిక్య‌పురం అనే గ్రామంలో చుక్క స‌త్త‌య్య అనే పేరుమోసిన ఒగ్గు క‌ళాకారుడు ఉండే. నీళ్లు ప‌డ‌క‌పోతే 58 బోర్లు వేసిండు ఆయ‌న పాపం. ఆ బోర్లు వేసుడు ఎంత బాధ‌. ఒక‌డు కొబ్బ‌రికాయ‌, ఒక‌డు తాళ‌పుచెవిల గుత్తి, ఒక‌డు తంగేడు పుల్ల ప‌ట్టుకొని వ‌స్త‌డు. ఎన్నిక‌ల ర‌కాల బాధ‌లు చూశాం. అవ‌స్థ‌లు ప‌డ్డాం. చుక్క స‌త్త‌య్య త‌న ఒగ్గు క‌థ‌ల మీద వ‌చ్చిన పైస‌ల‌న్నీ ఆ బోరు పొక్క‌ల్లోనే పోశారు. 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదు. ఇది చుక్క స‌త్త‌య్య క‌థ‌.

Also Read.. ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్ జమానాలో ఇంత ఘోరం ఉండే స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో. ఎక్క‌డ నీళ్లు లేకుండే. అని కేసీఆర్ తెలిపారు. ఆ బాధ‌ల‌న్నీ ఇవాళ లేవు. ఒక ల‌క్షా 10 వేల ఎక‌రాల‌కు స‌స్య‌శ్యామ‌లంగా నీళ్లు పారుతున్నాయి. వేలేరుకు నీళ్లు రావాల‌ని కొట్లాడి తెచ్చుకున్నారు. మ‌ల్క‌పురం రిజ‌ర్వాయ‌ర్ కావాల‌ని క‌డియం శ్రీహ‌రి కోరుతా ఉండే. ఇట్ల నీళ్ల కోసం ఇక్క‌డి బిడ్డ‌లు తండ్లడారు కాబ‌ట్టి.. గ‌వ‌ర్న‌మెంట్ స‌హ‌క‌రించింది కాబ‌ట్టి ల‌క్ష 10 వేల ఎక‌రాల‌కు నీళ్లు వ‌చ్చాయి.’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Latest News

More Articles