Monday, May 6, 2024

నాగార్జున‌ను అరెస్ట్ చేయాలి.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

spot_img

హైదరాబాద్: బిగ్ బాస్ షో వివాదం ముదురుతుంది. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని.. బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వ‌ల్లే ఈ దాడి జ‌రిగింద‌ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (HRC)కు హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు రెండు కేసులు న‌మోదు చేశార‌ని.. ఇందులో నాగార్జున పేరు ఎక్క‌డ‌ లేద‌ని.. నాగార్జునను కూడా బాధ్యుడ్ని చేయాలని న్యాయవాది అరుణ్ కోరారు.

Also Read.. అసత్య ప్రచారాన్ని ఖండించిన బాబా పసియుద్దీన్

ఈ దాడి వ‌ల‌న 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయ‌ని.. నాగార్జునపైనా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. ఈ షో (సీజ‌న్ 7) అనంత‌రం జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై జూబ్లీహిల్స్ పోలీసులు రెండు కేసులు న‌మోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను ప్రధాన నిందితుడిగా(ఎ-1) కేసు నమోదు చేశారు. అలాగే అతని సోదరుడు, స్నేహితుడిని సైతం నిందితులుగా(ఎ-2, ఎ-3) నమోదు చేసి మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

Latest News

More Articles