Tuesday, May 7, 2024

17వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్..ఎందుకో తెలుసా?

spot_img

టెక్నికల్ సమస్యల వల్ల దాదాపు 17వేల క్రెడిట్ కార్డులు ప్రభావితం అయినట్లు ఐసీఐసీఐ బ్యాంకు గురువారం అంగీకరించింది. ఈ కార్డులు డిజిటల్ మాధ్యమాల్లో పొరపాటున ఇతరుల అకౌంట్లకు లింక్ అయినట్లు తెలిపింది. దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు వెల్లడించింది. ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపరిచినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే..పరిహారం చెల్లిస్తామని బ్యాంకు హామీ ఇచ్చింది.

బ్యాంకు అధికారిక ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం..ఆన్ లైన్ లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న వినియోగదారుల అకౌంట్లకు కొత్త క్రెడిట్ కార్డులు తప్పుగా లింక్ అయ్యాయి. అంటే ఇదివరకే ఉన్న వినియోగదారలుు మరొకరి కోసం ఉద్దేశించిన కొత్త కార్డు వివరాలను చూసారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వగానే తాము అసలు అప్లయ్ చేయకున్నా కొత్త కార్డు వివరాలు కనిపించాయని పలువురు సోషల్ మీడియాలో వేదికగా వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్యాంకు ఈ విషయాన్ని గురువారం ధ్రువీకరించింది.

తాజా పరిణామంలో క్రెడిట్ కార్డు పూర్తి సంఖ్య సీవీవీ వంటి వివరాలు బహిర్గతం అయ్యాయి. వీటిని దుర్వినియోగపరచి మోసపూరిత లావాదేవీలు చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్స్ చేయడం కుదరదని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన వివరాల ద్వారా ఎలాంటి మోసం జరిగి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి :  మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు..తేదీలు ఇవే.!

Latest News

More Articles