Tuesday, April 30, 2024

జపాన్ లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 6.3 నమోదు.!

spot_img

భారీ భూకంపంతో జపాన్ మరోసారి వణికిపోయింది. 6.3 తీవ్రతతో పశ్చిమ జపాన్‌లో ఈ భూకంపం సంభవించింది.దీంతో భవనాలు కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.అయితే ఇప్పటివరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు ఇవ్వలేదు. USGS భూకంప కేంద్రాన్ని ఉవాజిమాకు పశ్చిమాన 18 కిలోమీటర్లు (11 మైళ్ళు) దూరంలో ఉన్నట్లు గుర్తించింది. దాదాపు 25 కిలోమీటర్ల లోతులో ఉంది. క్యుషు,షికోకు దీవులను వేరుచేసే ఛానల్‌లో భూకంపం ఏర్పడింది. బుధవారం రాత్రి నైరుతి జపాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. నష్టంపై అంచనా వేస్తున్నారు. అయితే, ప్రాథమిక స్థాయిలో పెద్దగా నష్టం జరగలేదు. దీనికి ముందు కూడా, గత వారం జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఇది కూడా చదవండి: అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర 

Latest News

More Articles