Wednesday, May 1, 2024

ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు.!

spot_img

4వ దశ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోకసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలుగో విడతలో లోకసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ,పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోకసభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈనెల 25వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి..26న పరీశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

లోకసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ పత్రాలను సమర్పించాలి. లోకసభ అభ్యర్థి రూ. 25వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావత చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో 50శాతం చెల్లిస్తే సరిపోతుంది.

ఇది కూడా చదవండి: ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు..ధర తెలుస్తే షాక్ అవ్వాల్సిందే.!

Latest News

More Articles