Friday, May 10, 2024

ఢిల్లీ సీఎం ఇంటికి ఈడీ అధికారులు..!

spot_img

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి ఈడీ బృందం చేరుకుంది. ఆయన అధికారిక నివాసం వెలుపల భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. పది మంది ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారని వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి కేజ్రీవాల్‌ను విచారించనున్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. దీంతో పాటు సెర్చ్ వారెంట్‌తో ఈడీ కూడా వచ్చింది. దర్యాప్తు సంస్థ మొత్తం ఇంటిని కూడా సోదా చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్టు నుంచి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నాడు నిరాకరించింది.

ఈడీ బృందం సీఎం నివాసానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అక్కడికి చేరుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం రైడ్ ప్రాంగణంలోనికి, బయటకు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించరు. దీంతో సౌరభ్ భరద్వాజ్ నివాసం బయటే ఉన్నారు. కాగా ఈడీ సమన్లను సవాలు చేస్తూ తన పిటిషన్‌లో మధ్యంతర ఉపశమనం కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈడీ అరెస్టు నుంచి తనకు మధ్యంతర ఉపశమనం ఇవ్వాలని కేజ్రీవాల్‌ హైకోర్టును కోరారు. ఈ కేసులో హైకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు కలిపించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి ద్రుష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సోదాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి:జపాన్ లో భూకంపం..ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు.!

Latest News

More Articles