Wednesday, May 1, 2024

తెలంగాణలోకి జూన్ 8 నుంచి నైరుతి రుతుపవనాల ప్రవేశం

spot_img

నైరుతి రుతుపవనాల సీజన్ లో ఈసారి దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ (IMD) ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంపై హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనాలను తెలిపింది.

జూన్ 8 నుంచి 11వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భావిస్తున్నామని చెప్పింది. రుతుపవనాలు వస్తూనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని, జులైలో భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఆగస్టులో సాధారణ రీతిలో వర్షపాతం నమోదవుతుందని.. మళ్లీ సెప్టెంబర్ లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

ఎల్ నినో పరిస్థితులు జూన్ నాటికి పూర్తిగా క్షీణిస్తాయని, జులైలో ఎల్ నినో అనుకూల పరిస్థితులు ఊపందుకుంటాయని వివరించింది. గత సీజన్ తో పోల్చితే ఈసారి రాష్ట్రంలో జలాశయాల్లో ఎక్కడా నీటి కొరత ఉండకపోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో సాధారణం మించి అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ కేసుల పై డీజీపీ కి బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

Latest News

More Articles