Monday, May 6, 2024

బాలానగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం

spot_img

హైదరాబాద్: బాలానగర్ పారిశ్రామికవాడలోని ఆక్జాన్ కెమికల్ లాబొరేటరీస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులో ఉన్న లాబొరేటరీస్ లో పొగలు రావడం గమనించిన కంపెనీ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైర్ ఇంజన్ల తో మంటలను అదుపు చేశారు.

ఆదివారం సెలవు దినం కావడంతో కార్మికులు ఎవరు లేకపోవడం వల్ల పెను ప్రమాదమే తప్పింది. మంటలను అదుపు చేసే క్రమంలో కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి స్వల్ప గాయాలు కావడంతో  చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. షాట్ సర్కుట్ కారణంగా నే అగ్ని ప్రమాదం సంభవించింది అని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది అనేదానిపై  విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Also Read.. మేడారంలో ఎత్తు బంగారం కొనాలంటే ఆధార్ తప్పనిసరి

Latest News

More Articles