Sunday, May 5, 2024

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు మళ్లీ విచారణ

spot_img

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసుని పోలీసులు మళ్లీ విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో హిట్ అండ్ రన్ కేసు లో చిన్నారితో పాటు నలుగురికి గాయాలయ్యాయి. మార్చి 17 2022 లో రోడ్ నెంబర్ 45లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల చిన్నారి పై ఓ కారు దూసుకెళ్లింది. ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కారుగా గుర్తించారు పోలీసులు. షకీల్ కుమారుడి డ్రైవింగ్ కారణంగానేబాలుడు చనిపోయినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు.

అప్పటి పోలీసులు షకీల్ కుమారుడి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చౌరస్తాలో బెలూన్స్ అమ్ముకొనే కుటుంబం పైకి దూసుకొని పోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడమే కాకుండా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తార్ కారుపై MLA షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కారు కాదని MLA స్టిక్కర్ ను తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్లో చెప్పిన మాజీ ఎమ్మెల్యే షకీల్ వాదించాడు. ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసిన వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేయడంతో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది.

మరో సారి ఈ కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు  విచారణ చేపట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ రాజ్ భవన్ ప్రజా భవన్ దగ్గర 2023లో డిసెంబర్ 24న అర్థరాత్రి కారుతో బీభత్సం సృష్టించిన కేసు నడుస్తోంది. పంజాగుట్ట ప్రజాభవన్ సమీపంలో ప్రమాదం జరగడంతో కానిస్టేబుళ్లు సోహైల్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో కానీ.. సోహైల్ కు బదులు షకీల్ ఇంట్లో ఉన్న పని మనిషిని పోలీసులు కేసులో ఇరికించారు. అప్పటికే  ఎమ్మెల్యే కొడుకు విదేశాలకు ఎగిరిపోయాడు.

ఈ కేసులో సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్రపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. రాత్రి కాల్స్ లో సోహైల్‌తో మాట్లాడిన స్నేహితుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: జయప్రద జైలు శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

Latest News

More Articles