Sunday, April 28, 2024

మగువలకు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు.!

spot_img

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర రూ. 67,175 ఉండగా..మంగళవారం నాటికి రూ. 508 పెరింది. దీంతో 67,683కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధరరూ. 75,853ఉండగా..మంగళవారం నాటికి రూ. 759 పెరిగింది. దీంతో 76,612కు చేరుకుంది.

అంతర్జాతీయంగా బంగారం ధర:
ప్రపంచవ్యాప్తంగా, మంగళవారం ఉదయం బంగారం ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. Comexలో బంగారం గ్లోబల్ ధర 0.02 శాతం లేదా $ 0.40 పెరుగుదలతో ఔన్స్ $ 2164.70 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, బంగారం గ్లోబల్ స్పాట్ ధర ఔన్స్‌కు 0.06 శాతం లేదా 1.22 డాలర్ల పెరుగుదలతో $ 2161.58 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధర:
మంగళవారం ఉదయం బంగారంతో పాటు అంతర్జాతీయంగా వెండి ధరలు కూడా పెరిగాయి. Comex లో వెండి గ్లోబల్ ధర 0.30 శాతం లేదా $ 0.08 పెరుగుదలతో ఔన్స్ $ 25.34 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, వెండి స్పాట్ ధర ఔన్స్‌కు 0.41 శాతం లేదా 0.10 డాలర్లు పెరిగి $ 25.14 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి.!

Latest News

More Articles