Wednesday, May 1, 2024

92 ఏళ్ల సినీ చరిత్రలో ‘హనుమాన్’ ఆల్ టైం రికార్డ్

spot_img

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘హనుమాన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై.. మంచి హిట్ సాధించింది. ఎన్నో పెద్ద సినిమాలను త‌ల‌ద‌న్ని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.275 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రూ.300 కోట్ల క్ల‌బ్‌లోకి దూసుకుపోతుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డు అందుకుంది. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ‘ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్’గా నిలిచింది. సంక్రాంతికి రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు ఇంతటి విజయాన్ని సాధించలేదు.

Read Also: అమెరికాలో కాలేజీ క్యాంపస్‎లో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

Latest News

More Articles