Wednesday, May 1, 2024

కాంగ్రెస్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే గురుకుల విద్యార్థి ప్ర‌శాంత్ మృతి

spot_img

భువనగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మేల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల మరణించడం దురదృష్టకరమన్నారు.

కేసీఆర్ పాలనలో ఘనకీర్తి సాధించిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోతున్నాయ‌ని తెలిపారు హరీశ్ రావు. వరుస ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనల వల్ల గురుకులాల ప్రతిష్ట దిగజారుతోందన్నారు. ప్రజా పాలన అంటూ ప్రతీకార పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురుకులాల్లో చదువుకుంటున్న పేద బిడ్డల సంక్షేమం గురించి కనీస ఆలోచన లేదు. ప్రశాంత్‌ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే. కాబట్టి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారి కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని డిమాండ్ చేశారు హ‌రీశ్‌రావు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ కేసుల పై డీజీపీ కి బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు

Latest News

More Articles