Saturday, May 4, 2024

వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు పూలే

spot_img

బడుగు, బలహీన వర్గాల బాగుకోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేపట్టిన కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు  అన్నారు. సామాజిక దార్శనికుడిగా, సంఘ సంస్కర్తగా, వర్ణవివక్షతపై పోరాడిన క్రాంతికారుడు పూలే అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన కొనసాగిందన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి హరీశ్‌ రావు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన… డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఫూలే, బాబు జగ్జీవన్‌రాం కలలుగన్న పాలనను తాము నిజం చేశాం. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సామాజిక సమానత్వ దిశగా కృషి చేశామని తెలిపారు.

వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి ఫూలే గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటుచేశామన్నారు. ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. బహుజనుల కోసం ఆత్మగౌరవ భవనాలు, బీసీల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని గుర్తుచేశారు. వృత్తుల వారీగా ప్రోత్సాహకాలు అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేశామన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్‌

Latest News

More Articles