Monday, May 6, 2024

సీఎం రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారని సోయి కూడా లేదు

spot_img

ప్రభుత్వ కక్ష పూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్ట పోయిందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నీళ్ళను ఏలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలమైందన్నారు.ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ను నమ్ముకొని పంటలు పెట్టాము, నీళ్ళు ఉండి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని భాద పడుతున్నారు. కేసీఆర్ హయం లో చెక్ డ్యామ్ లు నిర్మించి కాళేశ్వరం నీళ్ళను, అందించాము. కేసీఆర్ కాళేశ్వరం ప్రాధాన్యతను గుర్తించి కేంద్రంతో మాట్లాడి, మహారాష్ట్రను ఒప్పించి నిర్మించారు. కేసీఆర్ ఇప్పుడు ఉండి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండనిచ్చే వారు కాదు. కరీంనగర్ కేసీఆర్ వస్తున్నాడని తెలిసి గాయత్రి పంప్ ద్వారా నీళ్ళను లిఫ్ట్ చేసి కాలువలకు వదిలారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు ఉన్నారని సోయి కూడా లేదు, ఆయన మూటలతో ఢిల్లీకీ పోవడమే సరిపోతోంది. ప్రతిదానికి నోరు పారేసుకోని కేసీఆర్ పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వంద రోజుల్లోనే 200 మందీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. బట్టి విక్రమార్కకు, ఉత్తమ్ కుమార్ రెడ్డికీ ఎన్నడూ భాద్యత తెలియదు, రైతుల గురించి తెలియదు. పత్రికలలో లీక్ లు ఇచ్చి పెద్ద పెద్దగా రాపించి బ్రతుకుదామని అనుకుంటున్నారు. తెలంగాణ రాక ముందు ఇంతకంటే ఎక్కువ కుట్రలు చేసి పెద్ద పెద్దగా వార్తలు రాశారు. అయినా పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. కేసీఆర్ ఉంటే ఇంత భాధ ఉండకపోతుండే అని రైతులు భాదపడుతున్నారని అన్నారు.

ఒక వైపు కరువు పరిస్థితిలు వస్తున్నా.. సాగు నీరు, తాగు నీరు ఎలా ఇవ్వాలో సోయి లేకుండా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. గత 15రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పొలాల్లో రైతుల దగ్గరకు వెళ్ళింది. పంట నష్టం అంచనా వేసి ఈరోజు సీఎస్ కు వినతిపత్రం ఇచ్చామన్నారు. 100 రోజుల్లోనే 2014 కంటే ముందు పరిస్థితిలు రాష్ట్రంలో వచ్చాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలను ఆపేందుకు జోలే పట్టుకోని ఎలానైతే కేసీఆర్ తిరిగారో, ఇప్పుడు రైతులకు దైర్యం చెప్పేందుకు రైతుల దగ్గరకు కేసీఆర్ వెళ్తున్నారు. రైతు బంధు, 2 లక్షల రుణ మాఫీ ఏంటనే అమలు చెయ్యాలి. ఎన్నికల కోడ్ ఉందని ఆగొద్దు .మేము ఎక్కడా ఈసీకి ఎటువంటి ఫిర్యాదులు చెయ్యమన్నారు. 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. వెంటనే క్వింటాల్ కు 500 బోనస్ ఇచ్చి వడ్లు, మొక్కజొన్నలు కొనాలని డిమాండ్ చేశారు. నీళ్ళు ఇస్తామని చెప్పితే…. మిమ్మల్ని నమ్మి వరి పెట్టారు…. నీళ్ళు ఇవ్వక పోవడం వల్లనే పంటలు ఎండిపోయాయన్నారు జగదీశ్ రెడ్డి.

కరెంట్ సరిగ్గా ఇవ్వలేక, మోటర్లు కాలిపోతున్నాయన్నారు జగదీష్ రెడ్డి. కరెంట్ పోవడం లేదని మాట్లాడుతున్నారు…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో దావత్ కి వెళ్ళితే అక్కడ కరెంట్ పోయింది. ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు. హైదరాబాద్ లో దారుణంగా వాటర్ ఇబ్బంది ఉందన్నారు. ట్యాంకర్ బుక్ చేస్తేనే వారం రోజుల వరకు పడుతోందన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆరోపించారు జగదీష్ రెడ్డి. నష్ట పోయిన రైతాంగానికి వెంటనే ఎకరాకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: ఫోన్​ ట్యాపింగ్ కేసు​లో నాపై ఆరోపణలు చేసిన వారంతా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

Latest News

More Articles